సౌత్ ఇండస్ట్రీ పై తాప్సీ హాట్ కామెంట్స్ !

Taapsee Pannu

హీరోయిన్ తాప్సీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక, హాట్ కామెంట్స్ చేయడం అలవాటు చేసుకుంది. తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై మరోసారి కామెంట్స్‌ చేసింది. తన కొత్త సినిమా ‘అస్సీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. గ్లామర్‌ సన్నివేశాలు, పాటలకు సంబంధించి.. మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ తనపై ఒత్తిడి తెచ్చేవారు. సినిమా సెట్స్‌లో వందలాది మంది ముందు ఇలాంటివి చెప్పడం అసౌకర్యంగా అనిపించేది’ అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.

తాప్సీ ఇంకా మాట్లాడుతూ.. ‘దక్షిణాది, భోజ్‌పురి సినీ పరిశ్రమల్లో హీరోయిన్ల నాభిపై ఎక్కువగా దృష్టి పెడతారు. ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన తాప్సీ.. దక్షిణాది చిత్ర పరిశ్రమపై గతంలో పలుమార్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. సౌత్‌లో నటించడం వల్ల తనకు తగిన గుర్తింపు రాలేదు’ అంటూ తాప్సీ కామెంట్స్ చేసింది. తెలుగు మూవీ ‘ఝుమ్మంది నాదం’తో ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version