రీసెంట్ గా మన తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో అలరించిన ఫీల్ గుడ్ చిత్రమే “కపుల్ ఫ్రెండ్లీ”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి ప్రశంసలుతో పాటుగా మంచి వసూళ్లు కూడా అందుకుంది. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఈ సినిమా తనకి ఎంతో నచ్చింది అని తెలిపారు.
మరి తనకి కూడా ఎంతో నచ్చిన ఈ సినిమా 10 రోజుల ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ పది రోజుల్లో ఈ సినిమా మొత్తం 12.67 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది. ఇది మాత్రం ఈ చిత్రానికి చాలా మంచి నెంబర్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఆదిత్య రవీంద్రన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ వర్క్ అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.
