ప్రస్తుతం మన తెలుగు సినిమా దగ్గర పెళ్లిళ్ల శుభవార్తలే మంచి వైరల్ గా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నేడే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇక వీరి పెళ్లి తర్వాత మెగా కుటుంబం నుంచి అల్లు శిరీష్ పెళ్లి వేడుకలకి సంబంధించి కూడా గత కొన్ని రోజులు నుంచి సినీ వర్గాల్లో హంగామా నడుస్తుంది. అయితే ఫైనల్ గా ఈ వివాహ వేడుకపై అల్లు శిరీష్ కొత్త అప్డేట్ అందించాడు.
తన ఫియాన్స్ నయనికతో పెళ్లి ఈ మార్చ్ 6 న జరగబోతున్నట్టుగా డేట్ ని రివీల్ చేశారు. అలాగే ఈ పెళ్ళికి ముందు అతిధుల నడుమ జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుక డేట్ ని కూడా తాను అనౌన్స్ చేసాడు. సో ఈ రెండు ముఖ్యమైన తేదీలలో మంచి సందడి వాతావరణం నెలకొంటుంది. అన్నట్టు ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలు ఎక్కడో కాదు తమ అల్లు స్టూడియోస్ లోనే ఈ మార్చ్ 2న జరగనున్నట్టు తెలిపాడు.
