‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజ్.. ఓటీటీ డీల్ ఏకంగా రూ.80 కోట్లు..?

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

అయితే, ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే దీని డిజిటల్ రైట్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర ఓటీటీ హక్కులు ఏకంగా రూ. 80 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తొలుత ఈ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నప్పటికీ, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ సంస్థ అంతకంటే పెద్ద ఆఫర్ ఇవ్వడంతో పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఒక రీజనల్ చిత్రానికి ఈ స్థాయిలో ఓటీటీ డీల్ కుదరడం పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version