తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఇప్పుడు మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పుడు ఇది సూర్యకి తెలుగు సినిమా అని చాలా మంది అనుకున్నారు కానీ తర్వాత మాత్రం ఇది తమిళ్ సినిమానే అని కన్ఫర్మ్ చేశారు.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఒక టాలీవుడ్ దర్శకుడు టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అందులోని తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న తమిళ హీరోతో సినిమా నుంచి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుంది అంటే అటు తమిళ ఆడియెన్స్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలానే చాలామంది ఇవాళ వచ్చిన ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ పోస్టర్ కోసం చూసారు.
కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమా నుంచి కేవలం ఇంగ్లీష్, తమిళ్ లో మాత్రమే రెండు పోస్టర్స్ వచ్చాయి. దీంతో తెలుగు ఆడియెన్స్ మాత్రం దారుణంగా డిజప్పాయింట్ అయ్యారు. ఇది మొదటి సారి కాదు చాలా సినిమాల విషయంలో జరిగిందే. మన తెలుగు సినిమాలు తీస్తున్నప్పటికీ కనీసం మనం తెలుగు టైటిల్స్ తో పోస్టర్ లు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్న.
దీనితో ఈ సినిమా తెలుగు రిలీజ్ లేదు కాబోలు అని అనుకోవచ్చా? అంటే డెఫినెట్ గా తెలుగులో ఈ చిత్రం రిలీజ్ అయ్యి తీరుతుంది. అయినప్పటికీ ఎందుకు తెలుగు ప్రేక్షకులని గ్రాంటెడ్ గా తీసుకోవడం? అనేది చాలామంది నెటిజన్స్ ప్రశ్న. కానీ ఫైనల్ గా ఈ కామెంట్స్ మేకర్స్ వరకు వెళ్లినట్టు ఉన్నాయి. దీనితో తెలుగు పోస్టర్ ని ఎట్టకేలకి వదిలారు. దీనితో తెలుగు ప్రేక్షకులు కొంచెం శాంతించారు.
