అట్లీ సినిమా నుంచి బన్నీ ఓల్డేజ్ మాస్ లుక్ లీక్?

AA Atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాల లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ లైనప్ లో ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్ దర్శకుడు అట్లీతో చేస్తున్న సినిమా కూడా ఒకటి. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పలు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడని ఇది వరకే టాక్ ఉంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ లుక్ వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ఇది అల్లు అర్జున్ ఓల్డేజ్ గెటప్ లుక్ అంటూ.. అంతేనా అది యంగ్ అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అంటూ ఎవరికి నచ్చిన థియరీలు చెప్పేసుకుంటున్నారు. ఇదైతే కొంచెం మాస్ గానే కనిపిస్తుంది కానీ నిజానికి ఆ లుక్ కొంచెం గమనిస్తే ఏదో ఎడిట్ చేసిన ఫోటో లానే కనిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version