ఆగని AA23 థీమ్ ర్యాంపేజ్.. ఏదీ మొదలు కాకుండానే ఇలా ఉంటే!

AA23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు కోలీవుడ్ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ దర్శకుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్ ని చేస్తుండగా ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు. అయితే ఈ లోకేష్ కనగరాజ్ తో సినిమా ఇంకా మొదలు కాలేదు కానీ దీనిపై ఉన్న హైప్ మాత్రం అంతా ఇంతా కాదు ఈ సినిమా అనౌన్సమెంట్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ థీమ్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ ఇప్పటికీ కొనసాగుతుంది.

ఫాస్టెస్ట్ 5 లక్షల నుంచి 1 మిలియన్ రీల్స్ రికార్డు సొంతం చేసుకున్న ఈ థీమ్ ఇప్పుడు ఫాస్టెస్ట్ 1.5 మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేసేసింది. దీనితో ఈ సినిమా ఇంకా మొదలు కాకుండానే ఊహించని రీచ్ ని సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇకవేళ సినిమా మొదలై ఒకో కంటెంట్ బయటకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలోనే షూట్ మొదలు పెట్టుకోనుంది.

Exit mobile version