ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.
అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు. కాగా, బన్నీ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. కాగా, ఆ రోజున AA22 చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో బన్నీ బర్త్ డే కానుకగా రాబోయే ఈ ట్రీట్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
