పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ ఉగాది కానుకగా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా నుంచి నేడు ట్రైలర్ రాబోతుండగా ఇప్పుడు సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారిక క్లారిటీ మేకర్స్ ఇచ్చేసారు. ఈ సినిమా ఈవెంట్ ని మేకర్స్ ఈ మార్చ్ 15న, యూసుఫ్ గూడా గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు అని ఇది వరకే మేము తెలియజేశాము.
ఇప్పుడు ఇదే నిర్మాత కూడా కన్ఫర్మ్ చేయగా లేటెస్ట్ గా మేకర్స్ కూడా అధికారికంగా అనౌన్స్ చేసి రేపు మార్చ్ 15న సాయంత్రం ఆరున్నర నుంచి యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ చేస్తున్నట్టు తెలిపారు. సో అభిమానులకు ‘ఓజి’ తర్వాత మరో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా థమన్ ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ మార్చ్ 19న విడుదల కాబోతుంది.
All set for CULT CELEBRATIONS 💥💥#UstaadBhagatSingh Grand Pre-Release Event tomorrow (March15) from 5 PM onwards at Police Grounds, Hyderabad ❤🔥
Watch Live here!
▶️ https://t.co/mWqChbbalE#UBSTrailer OUT TODAY at 6:30 PM.GRAND RELEASE WORLDWIDE this Ugadi – 19th MARCH,… pic.twitter.com/u9xYdY5g2G
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 14, 2026
