లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘In Memoriam’ సెగ్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకుంటూ ఆస్కార్ నివాళులర్పించింది. ఈ క్రమంలో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్‌కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచడం విశేషం.
ఆస్కార్ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. వారిని స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాల గురించి కొందరు వేదికపై మాట్లాడారు. అయితే, ఆ వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తంచేస్తూ ఎక్స్ వేదికగా మెసేజ్ పోస్ట్ చేశారు. ఐతే, సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని తెలుస్తోంది.
