ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్: ‘ధురంధర్ 2’ గట్టి పోటీ.. పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చే అంశాలు, అడ్డంకులు ఇవే!

us 1

ముఖ్య అంశాలు

  • ఉగాది, రంజాన్ పండగ సెలవులు, అలాగే గత రెండు నెలలుగా టాలీవుడ్ లో సరైన పెద్ద సినిమాలు లేకపోవడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు అతిపెద్ద అడ్వాంటేజ్ గా మారాయి.
  • భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ పోటీగా రావడం, పవన్ సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ట్రేడ్ వర్గాల్లో కాస్త టెన్షన్ పెంచుతోంది.
  • ఆంధ్రాలో పవన్ కు తిరుగులేకపోయినా.. నైజాం ఏరియాలో మాత్రం రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు గట్టి పోటీ తప్పేలా లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే టాలీవుడ్ లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే, ఒక పక్క భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కొన్ని సానుకూల అంశాలతో పాటు, పలు సవాళ్లు కూడా స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘ధురంధర్ 2’ కూడా అదే రోజు బరిలో దిగుతుండటంతో ఈ బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారింది.

ముందుగా పవన్ సినిమాకు కలిసొచ్చే ప్రధాన అంశాల గురించి మాట్లాడుకుంటే.. సంక్రాంతి పండగ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయింది. ఒకపక్క ఎగ్జామ్స్ సీజన్, మరోపక్క ఈ డ్రై పీరియడ్‌లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. దీంతో సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ పడితే చూద్దామని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా నడుస్తున్న ఈ డ్రై రన్‌కు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గట్టి బ్రేక్ వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మార్చి 19న ఉగాది, దానికి తోడు రంజాన్ పండగలు రావడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. పండగ వాతావరణం, వరుస సెలవులు ఉండటం వల్ల పబ్లిక్ భారీ సంఖ్యలో థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఈ హాలిడేస్‌తో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం.

ఇదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కు కొన్ని టెన్షన్లు కూడా తప్పడం లేదు. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ నుంచి పవన్ సినిమాకు ఊహించని రేంజ్ లో పోటీ ఎదురుకాబోతోంది. ధురంధర్ మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఇప్పుడు సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే.. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్నా, ప్రీ రిలీజ్ బజ్ ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ప్రమోషన్స్ ఇంకాస్త అగ్రెసివ్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

బాక్సాఫీస్ లెక్కల పరంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో ధురంధర్ 2 ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. థియేటర్లన్నీ ఉస్తాద్ హవానే నడుస్తుంది. కానీ, నైజాం (తెలంగాణ) మార్కెట్ లో మాత్రం సీన్ కాస్త భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. ఇక్కడ మల్టీప్లెక్స్ ఆడియన్స్ తో పాటు మాస్ సెంటర్స్ లో కూడా ధురంధర్ 2 కు భారీ డిమాండ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ఆ సినిమా జోరు చూపిస్తోంది. కాబట్టి నైజాం ఏరియాలో పవన్ సినిమాకు రణవీర్ సింగ్ గట్టి పోటీనే ఇవ్వబోతున్నాడు. ఏదేమైనా.. హరీష్ శంకర్ మార్క్ ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ స్వాగ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే.. ఎలాంటి పోటీ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులు తిరగరాయడం పక్కా.

Exit mobile version