24 గంటల నాన్-స్టాప్ షోలు: ‘ధురంధర్ 2’ దెబ్బకు 30 ఏళ్ల DDLJ రికార్డ్ బ్రేక్.. షో టైమ్ మార్చేసిన మరాఠా మందిర్!

Dhurandhar 2

బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ మేనియా మామూలుగా లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) రిలీజ్‌కు ముందే ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేస్తోంది. సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న ఊహించని రెస్పాన్స్ చూసి థియేటర్ యాజమాన్యాలు ఏకంగా 24 గంటల పాటు షోలు వేసేందుకు సిద్ధమయ్యాయి.

ఈ సినిమా దెబ్బకు ఏకంగా 30 ఏళ్ల బాలీవుడ్ చరిత్రే మారిపోయింది. ముంబైలోని ఐకానిక్ ‘మరాఠా మందిర్’ థియేటర్‌లో షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ (DDLJ) గత మూడు దశాబ్దాలుగా ప్రతిరోజూ ఉదయం 11:30 గంటలకు ప్రదర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు ‘ధురంధర్ 2’ కోసం ఆ ఐకానిక్ స్లాట్‌ను త్యాగం చేయక తప్పలేదు. రణ్‌వీర్ సినిమా దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివి ఉండటంతో.. మరాఠా మందిర్ యాజమాన్యం డీడీఎల్‌జే షోను ఉదయం 10 గంటలకు మార్చేసింది. ఒక కొత్త సినిమా కోసం దశాబ్దాల నాటి డీడీఎల్‌జే టైమింగ్‌ను అడ్జస్ట్ చేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

మరోవైపు సినిమా రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం వల్లే మల్టీప్లెక్స్‌లు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. సాధారణంగా ఒక స్క్రీన్‌పై రోజుకు నాలుగు షోలు వేయడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు డిమాండ్ తారాస్థాయిలో ఉండటంతో ముంబై, థానే లాంటి ప్రాంతాల్లోని పీవీఆర్, మూవీమ్యాక్స్ లాంటి మల్టీప్లెక్స్‌లు అర్ధరాత్రి 1:50 గంటలకే షోలను ప్రారంభిస్తున్నాయి. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా థియేటర్లలో 24 గంటల పాటు ‘ధురంధర్ 2’ నడవబోతోంది. రేపు పడబోయే పెయిడ్ ప్రీమియర్స్ పూర్తి కాగానే.. గురువారం తెల్లవారుజాము నుంచే ఈ పోస్ట్-మిడ్‌నైట్ షోల హంగామా మొదలుకానుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూస్తే కళ్లు చెదిరిపోవడం ఖాయం. ఇప్పటికే ఓపెనింగ్ వీకెండ్‌కు సంబంధించి ఇండియాలో 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. పెయిడ్ ప్రీమియర్స్, అలాగే డే 1 షోలు కలుపుకుంటే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇండియాలో రూ.70 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ నెంబర్ రూ.130 కోట్లు దాటేసి రికార్డు సృష్టించింది. అండర్‌కవర్ ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీగా రణ్‌వీర్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్ వెరసి ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర లిఖించడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

Exit mobile version