బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) విడుదలకు ముందే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఫస్ట్ రివ్యూ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది.
నిన్న రాత్రి ‘ధురంధర్ 2’ స్పెషల్ షో చూసిన వర్మ.. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కు ఇది వంద రెట్లు ఉంటుందని ఆయన కితాబిచ్చారు. కలెక్షన్స్, ఆడియన్స్ రెస్పాన్స్, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ‘కొత్త సినిమాటిక్ ఆర్డర్’ కు పునాది అని వర్మ చెప్పుకొచ్చారు. పాత సినిమా రికార్డులన్నీ ఇక కనుమరుగైపోతాయంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హాలీవుడ్ డైరెక్టర్లు కూడా చూడాల్సిందే!
డైరెక్టర్ ఆదిత్య ధర్ టేకింగ్‌పై కూడా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇకపై డైరెక్టర్ అనే పదానికి స్పెల్లింగ్ ఆదిత్య ధర్ దగ్గరే మొదలవుతుంది” అని ప్రశంసించారు. అంతేకాదు, క్రిస్టోఫర్ నోలన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటూ ఆయన సూచించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా వర్మ రివ్యూలు కాస్త అతిశయోక్తిగా ఉంటాయనే టాక్ ఉన్నప్పటికీ, రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో రణ్‌వీర్ సింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా ‘ధురంధర్ 2’ ప్రీమియర్ షోలు మొదలుకానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే దద్దరిల్లిపోతుండటంతో, తొలి రోజే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో కొత్త రికార్డులు నమోదు కావడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
After last nights watch of #Dhurandhar2 in terms of it’s sheer cumulative impact in every which way , whether on it’s expected collections , audience euphoria , social influences , cinematic grammar breaking , and above all the psychological audio visual impact , it will be a…
— Ram Gopal Varma (@RGVzoomin) March 18, 2026
