ఈ ఉగాది రేస్ లో రిలీజ్ కావాల్సిన భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన భారీ చిత్రం “టాక్సిక్” కూడా ఒకటి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ కన్నడ – ఆంగ్ల చిత్రం మొదట్లో మంచి హైప్ ని సెట్ చేసుంకుంది.ఇలా పలు డేట్స్ తర్వాత ఎట్టకేలకి ఈ ఉగాదికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు కానీ ఇదే డేట్ లో ధురంధర్ 2 అనే సెన్సేషన్ ని అనౌన్స్ చేసిన తర్వాత లెక్కలు మారిపోయాయి. అప్పటికీ కూడా యష్ ఎక్కడా తగ్గకుండా తన సినిమాని పోటీగా దింపుతున్నట్టే అప్డేట్స్ ఇస్తూ వచ్చారు.
కానీ పాన్ ఇండియా ఆడియెన్స్ మూడ్ అంతా ధురంధర్ 2 వైపు ఉండడం బాగా గమనించారో ఏమో కానీ రేస్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇండియా వైడ్ ఒక్క ధురంధర్ 2 నామ స్మరణ మాత్రమే ఎక్కువ వినిపిస్తుంది. పైగా హిందీ మార్కెట్ లో అయితే పెను సంచలనంగా ధురంధర్ 2 మారిపోయింది. సో పాన్ ఇండియా వైడ్ మార్కెట్ లో మెయిన్ గా తెలుగు, హిందీ వెర్షన్ లలో వసూళ్లు ఎక్కువ టార్గెట్ చేసిన టాక్సిక్ మేకర్స్ కి ఇదే హవాలో వచ్చి ఉంటే చాలా ప్రభావం కనిపించి ఉండేది. ఓ రకంగా పోటీకి రాకుండా ఉండడమే చాలా వరకు సేఫ్ అయ్యిందని చెప్పొచ్చు. మరి కొత్త డేట్ లో వచ్చినపుడు టాక్సిక్ సినిమా పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
