శర్వా ‘జార్జ్ క్రిష్’ మొదటి షెడ్యూల్ ఫిక్స్ !

George Krish

హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఇప్పటికే ఈ సినిమా పై చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఏప్రిల్ మూడో వారం నుంచి ఈ సినిమా ఘాట్ ను స్టార్ట్ చేయనున్నారు. మొదటి షెడ్యూల్ లో శర్వానంద్ ఎంట్రీ సీన్స్ ను ఘాట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమాలో రుక్మిణీ వ‌సంత్ హీరోయిన్‌ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

అన్నట్టు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

Exit mobile version