ఏపీలో ‘ఉస్తాద్’ టికెట్ రేట్స్ పై గుడ్ న్యూస్!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల మరియు రాశీ ఖన్నా కలయికలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉగాది కానుకగా వచ్చిన ఈ సినిమాలో మంచి మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ వీకెండ్ ఈ సినిమాకి దక్కుతుంది. ఇక రెండు తెలుగు స్టేట్స్ లో ఒక్క ఆంధ్రప్రదేశ్ వరకు తమ సినిమాకి టికెట్ ధరల హైక్ లు వచ్చిన సంగతి తెలిసిందే.

చాలామందికి ఈ టికెట్ ధరలు పెంచడం అనేది ఒకింత, మెయిన్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్స్ కి దూరం చేస్తున్నాయి. సో ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ ఈ సోమవారం నుంచే ఏపీలో సాధారణ టికెట్ ధరలతో సినిమాని ప్రదర్శితం చేయనున్నట్లు ఖరారు అయ్యింది. మరి ఈ స్టెప్ ఎంతవరకు సినిమాకి ప్లస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version