
ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సెన్సేషనల్ సినిమానే ధురంధర్ 2. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. బాలీవుడ్ లో సహా ఇండియన్ సినిమా దగ్గర కనీ వినీ ఎరుగని రేంజ్ భారీ వసూళ్లతో ఈ సినిమా సంచలనం సెట్ చేసింది. అయితే తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడ్డ సంగతి తెలిసిందే.
కానీ తెలుగు వెర్షన్ లో చాలా వరకు సిటీ ఏరియా లలో మాత్రమే ప్రభావం ఉంటుంది అని అంచనా వేశారు. కానీ ఈ సినిమా అందుకు భిన్నంగా రూరల్ మాస్ ఏరియా లలో కూడా దుమ్ము లేపుతూ దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ వీకెండ్ కి అయితే చాలానే మాస్ ఏరియాస్ సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఫస్ట్ షో, సెకండ్ షోస్ కూడా హౌస్ ఫుల్స్ పడిపోయాయి. సో ఈ సినిమా తెలుగు వెర్షన్ పెర్ఫార్మన్స్ ని తక్కువ అంచనా వేసిన వారికి మాత్రం ఇది ఒకింత ట్విస్ట్ అనే చెప్పొచ్చు. మరి ఇదే హవా వీక్ డేస్ లో కూడా కొనసాగుతుందో లేదో చూడాలి.