యంగ్ హీరో శర్వానంద్ మళ్లీ తన కొత్త సినిమా కోసం సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. తన బైకర్ కోసం బాగా సన్నబడ్డ శర్వా.. ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం అందుకు భిన్నంగా మారబోతున్నాడు. శర్వా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘జార్జ్ క్రిష్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా కోసం శర్వానంద్ ఓల్డ్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కథలో శర్వానంద్ 60 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడట. సినిమాలో రెండు ఎపిసోడ్స్ లో ఈ లుక్ ఉంటుందట. గతంలో కూడా శర్వానంద్ ఓల్డ్ గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ ఆ ఓల్డ్ లుక్ లోకి మారబోతున్నాడు. ఇక జూన్ లో ఈ సినిమా ఘాట్ ను స్టార్ట్ చేయనున్నారు. మొదటి షెడ్యూల్ లో శర్వానంద్ ఎంట్రీ సీన్స్ ను ఘాట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
