ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక భారీ ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వస్తున్న అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆ రోజు కేవలం సినిమా టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను మాత్రమే విడుదల చేయనున్నారట. ఇది పెద్ద ట్రీట్ ఆశించిన అభిమానులకు కొంచెం నిరాశ కలిగించే విషయమే.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా, బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోనే హీరోయిన్గా నటిస్తోంది. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అర్జున్ పుట్టినరోజున రాబోయే ఆ పోస్టర్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
