సెన్సార్ పనులు ముగించుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘LIK’.. రన్‌టైమ్ ఎంతంటే..?

Love Insurance Kompany

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న యాక్టర్‌గా మారాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు మేకర్స్. ఒక రొమాంటిక్ డ్రామాకు ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

కాగా ఈ సినిమాలో ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా యోగి బాబు, గౌరీ కిషన్, మాళవిక ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా, తెలుగులో ఈ సినిమాను శ్రీ పద్మిని సినిమాస్ విడుదల చేస్తోంది.

Exit mobile version