‘దొంగ నా కొడుకు’ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న మౌళి

#90s సిరీస్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మౌళి ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ యాక్టర్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలు అందడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అయితే, తాను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక తాజాగా మౌళి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ ‘దొంగ నా కొడుకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్‌ను బట్టి ఈ సినిమా ఎలాంటి కామెడీతో రాబోతుందో అర్థమవుతుంది.

ఇక సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్ల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు మౌళి సిద్ధమవుతున్నాడు.

Exit mobile version