నిజ జీవిత ఘటనల ఆధారంగా ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఒక కొత్త హారర్ థ్రిల్లర్ రాబోతోంది. M3 మీడియా, మహా మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ‘ప్రొడక్షన్ నెం.4’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సూర్యాస్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డార్క్ అండ్ డేంజరస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ పాటలు రాయడం ప్రధాన ఆకర్షణ. అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, మిర్లాన్ నసీర్ సినిమాటోగ్రాఫర్‌గా, వంశీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌ను రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అలాగే, వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
