పవర్‌ఫుల్‌గా ‘స్వయంభు’ ఫస్ట్ సింగిల్ సాంగ్.. రారా ధీవరా అంటూ సత్తా చాటిన నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘రా రా ధీవరా’ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. రవి బస్రూర్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట, ఉర్రూతలూగించే ఒక పవర్‌ఫుల్ ఆంథమ్‌లా సాగుతోంది. సంతోష్ వెంకీ గాత్రం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ వీరగాథకు మరింత గాంభీర్యాన్ని అద్దాయి.

ఈ సాంగ్‌లో నిఖిల్ మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. యుద్ధానికి సిద్ధమైన యోధుడిలా ఆయన బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా రెండు కత్తులతో చేసిన పోరాట విన్యాసాలు నిఖిల్ పడిన కష్టాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, యుద్ధ తంత్రం మరియు డ్యాన్స్‌ను మేళవించి నిఖిల్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నభా నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో విజువల్స్ కు మరింత గ్లామర్ జోడించింది.

సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో కనిపిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ తన విజువల్స్‌తో భారీ సెట్స్ మరియు యుద్ధ భూమిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. వి.జె. బిన్ని కొరియోగ్రఫీ పాటలో జోష్ నింపింది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఇప్పుడు వచ్చిన ఈ ఎనర్జిటిక్ సాంగ్‌తో ‘స్వయంభు’ సమ్మర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమనిపిస్తోంది. త్వరలోనే ఈ పాన్ ఇండియా చిత్రం యొక్క విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version