మన టాలీవుడ్ యువ టాలెంటెడ్ హీరోస్ లో రామ్ పోతినేని కూడా ఒకరు. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలుకా సినిమాతో పరిచయం అయ్యిన తాను ఈసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కొత్త స్టెప్ తీసుకుంటున్నట్టుగా ఆ మధ్య వచ్చిన టాక్ వైరల్ గా మారింది. తన సోదరుడుతోనే కలిసి ఈ సినిమా చేయనున్నట్టు వచ్చినా బజ్ ఆసక్తిగా మారగా ఇప్పుడు మరో క్రేజీ టాక్ బయటకి వచ్చింది.
ఎందుకంటే ఈసారి తన సినిమాకి తానే కథ రాసుకున్నాడని తెలుస్తుంది. రామ్ పోతినేని ఈసారి ‘లోన్ వుల్ఫ్’ గా కనిపిస్తాడట. ఇదే ప్రస్తుతం ఆ సినిమాకి వర్కింగ్ టైటిల్ అన్నట్టు కూడా ఇప్పుడు టాక్. సో రామ్ ఎలాంటి ట్రీట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడో చూడాలి. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. మరి కథ ఎలానో తనదే కాబట్టి డైరెక్షన్ లో కూడా రామ్ దిగుతాడేమో చూడాలి.
