ఇండియన్ సినిమా దగ్గర యానిమేషన్ జానర్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అయితే ఆ జానర్ కి వన్నె తెచ్చిన సినిమా మాత్రం మహావతార్ నరసింహ సినిమానే అని చెప్పాలి. దర్శకుడు నమ్మిన సంకల్పానికి మన ఇండియన్ సినిమా దగ్గరే ఈ సిరీస్ కి ఇప్పుడు భారీ క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తుండగా వాటిలో లేటెస్ట్ సినిమా మహావతార్ పరశురామ్ ని అనౌన్స్ చేశారు.
అయితే దీనిపై వదిలిన మోషన్ పోస్టర్ టీజర్ మాత్రం ఫ్యాన్స్ కి ఎక్కడో కొంచెం తేడాగా అనిపించేలా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా యానిమేషన్ సినిమా కావడంతో ఏ ఐ విజువల్స్ తో చేస్తున్న కంటెంట్ కి పూర్తి భిన్నమైన ట్రీట్ నే అందిస్తుంది. కానీ ఈ మోషన్ పోస్టర్ టీజర్ లో చూస్తే ఆ కంటెంట్ సోషల్ మీడియాలో ఎంతోమంది చేస్తున్న ఏ ఐ విజువల్స్ తరహాలోనే కనిపిస్తున్నాయి. దీనితో వీరు కూడా అదే ట్రాక్ లోకి గాని వస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. సో మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో అనేది నెక్స్ట్ కంటెంట్ తోనే తెలవచ్చు.
