మే నెలలో థియేటర్లలోకి ‘పురుష:’.. తుది దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు

పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. సరస్వతి బత్తుల సమర్పిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్‌తో పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారిన పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సప్తగిరి, వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్‌కుమార్, అనంత్ శ్రీరామ్ వంటి ప్రముఖుల పాత్రలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ ఈ కమర్షియల్ ఎంటర్టైనర్‌ను వేసవి కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం, కోటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version