‘ఆనందో బ్రహ్మ’, ‘సేవ్ ది టైగర్స్’ వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌ల సృష్టికర్త మహి వి. రాఘవ్ నుంచి వస్తున్న సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ఈ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక.
సాధారణంగా దెయ్యాలు మనుషులను భయపెడతాయి. కానీ, అసలు భయం అంటే ఏంటో తెలియని పిచ్చివాళ్లు దెయ్యాలకు ఎదురైతే ఎలా ఉంటుంది? దెయ్యాలకు, పిచ్చివాళ్లకు మధ్య జరిగే ఈ వినోదాత్మక పోరాటమే ఈ సినిమా ప్రధానాంశం. సరికొత్త ట్విస్టులు, ఫన్నీ డైలాగ్స్‌తో ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై శివ మేక, సాహితి చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా.. గోగు ఆర్.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పూకీ ఫన్ రైడర్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
