‘లెనిన్’ క్లైమాక్స్ కోసం ప్యాచ్ వర్క్ ?

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఐతే, ఇప్పటికే ఫైనల్ కట్ ఎడిటింగ్ చూసిన నాగార్జున కొన్ని సలహాలను సూచించారు. ఆ సలహాలకు అనుగుణంగా కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లోని ప్యాచ్ వర్క్ ను షూట్ చేయడానికి టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షూట్ లో అఖిల్ తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట. ఇక ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.

Exit mobile version