వినోదాత్మకంగా ‘MRP’ టీజర్.. ఆవిష్కరించిన నిర్మాత సాహు గారపాటి

ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ‘ఎంఆర్పీ’ (MRP) చిత్ర టీజర్ ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా టీజర్‌ను ఆవిష్కరించిన ఆయన, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మంచి స్పందన దక్కించుకుంటోంది.

పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై శ్రవణ్ జేష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాణ బాధ్యతలు కూడా స్వయంగా నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే వినూత్న కథతో, పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. యువతకు కనెక్ట్ అయ్యే సరదా సన్నివేశాలు, స్టైలిష్ మేకింగ్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, డొనాల్ బిష్త్, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, గగన్ విహారి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ అరసాడ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, రాకేష్ కొలంచి సినిమాటోగ్రఫీ, సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version