పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో తన కెరీర్ లో క్రేజీ యూత్ ఫుల్ సెన్సేషన్ సినిమా “డార్లింగ్” కూడా ఒకటి. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ అప్పట్లో ప్రభాస్ కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇక మొదటిసారి ఈ సినిమా రీరిలీజ్ కి రాగా దీనికి అనూహ్య స్పందన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది.
అంతే కాకుండా మొదటి రోజు, ప్రీమియర్స్ కలిపి ఆల్ టైం రికార్డ్స్ తోనే మొదలైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తదితర ఏపీ ప్రాంతాల్లో ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల్లో టాక్. ఇక డే 1 కి గాను ఈ సినిమా 7.59 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా రాబట్టింది. దీనితో డార్లింగ్ డే 1 వసూళ్లు మన టాలీవుడ్ నుంచి రికార్డు రీరిలీజ్ లలో ఒకటిగా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించగా ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. అలాగే బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.
