NBK111 కోసం నయన్ రెమ్యునరేషన్ మెలిక..?

NBK-111

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘NBK 111’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్టులో హీరోయిన్ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వాస్తవానికి, బాలయ్య సరసన నటించేందుకు మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేశారు. వీరిద్దరిదీ ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాలతో కూడిన సూపర్ హిట్ కాంబినేషన్. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార స్థానంలో చందమామ కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. నయనతార ఈ సినిమా కోసం దాదాపు రూ.10 కోట్ల భారీ పారితోషికం డిమాండ్ చేయడం, కాల్షీట్ల సర్దుబాటు సమస్యలు మరియు ప్రమోషన్లకు అందుబాటులో ఉండకపోవడం వంటి కారణాల వల్ల మేకర్స్ ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాజల్ తక్కువ పారితోషికంతో పాటు ప్రచార కార్యక్రమాలకు కూడా వస్తానని హామీ ఇవ్వడంతో టీమ్ ఆమె వైపు మొగ్గు చూపింది.

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం చిత్రబృందం ‘వీరసింహారెడ్డి’ తరహాలోనే ఒక పవర్‌ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తోంది. ఏదేమైనా రెమ్యునరేషన్ కోసం నయనతార బాలయ్యతో మరో క్రేజీ ఛాన్స్ మిస్ చేసుకుందని నందమూరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version