‘వారణాసి’ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్న జక్కన్న!

varanasi

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న పాన్ వరల్డ్ లెవెల్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న అవైటెడ్ సినిమా “వారణాసి” కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాని గ్లోబల్ ప్లాట్ ఫామ్ మీద మాత్రం జక్కన్న నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా మెక్సికోలో జరుగుతున్న పాపులర్ కామిక్ కాన్ ఈవెంట్ లో వీడియో మెసేజ్ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కూడా తాను అక్కడి ప్రేక్షకులని అడ్రెస్ చేస్తూ కనిపించిన వీడియోలో వారణాసి టీషర్ట్ ధరించి కనిపించడం విశేషం. ఇలా వారణాసి చిత్రాన్ని తనదైన శైలిలో వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లోకి తీసుకెళ్లేలా జక్కన్న చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version