సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా వారణాసి సినిమాతో గ్లోబల్ ఐకాన్ గా మారనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చేస్తున్నారు సరే.. మరి నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న అభిమానుల్లో ఇప్పుడు నుంచే ఉంది. అయితే మహేష్ బాబు తదుపరి లైనప్ పై ఓ ఊహించని బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో మహేష్ బాబు నెక్స్ట్ గా ఏకంగా మూడు సినిమాలు ఓకే చేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఇందులో ఎంతమేర నిజముందో కానీ తనతో బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ నెక్స్ట్ సినిమా ఉండొచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అది కూడా వారణాసి తర్వాత ఇమీడియేట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా కూడా టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ప్రస్తుతం వారణాసి షూటింగ్ ని జక్కన్న శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న గ్రాండ్ గా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కానుంది.
