మరోసారి రిపీట్ కానున్న ‘ధురంధర్’ కాంబో.. ఈసారి ఎలాంటి జోనర్..?

దర్శకుడు ఆదిత్య ధర్ ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్‌గా మారాడు. ఫాంటసీ హంగులు లేకుండా కేవలం స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, ‘ధురంధర్’ సిరీస్‌తో తన సత్తా చాటాడు. ముఖ్యంగా మూడు నెలల గ్యాప్‌లోనే వచ్చిన సెకండ్ పార్ట్ ‘ధురంధర్: ది రివెంజ్’, ఏకంగా బాహుబలి 2, పుష్ప 2 వంటి భారీ చిత్రాల రికార్డులను సవాల్ చేస్తూ వసూళ్ల భీభత్సం సృష్టించింది.

ప్రస్తుతం అందరి దృష్టి ఆదిత్య ధర్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడనే దానిపైనే ఉంది. రాజమౌళి, సుకుమార్ వంటి దిగ్గజ దర్శకుల సరసన చేరిన ఆయన, త్వరలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలతో ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, ముంబై మీడియా సమాచారం ప్రకారం ఆయన మళ్లీ రణవీర్ సింగ్‌తోనే పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది అంటే 2027 మార్చి నుండి ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ‘యురి’, ‘ధురంధర్’ చిత్రాల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియాలోని టాప్ స్టార్స్ అందరూ ఆయనతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నా, ఆదిత్య ధర్ మాత్రం కథ సిద్ధమయ్యాకే క్యాస్టింగ్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నాడు.

Exit mobile version