మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని 2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వేసవి సెలవుల కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా, జూన్ మొదటి వారంలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ ga నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
