ది ప్యారడైజ్ : నాని సినిమా రీ-షూటింగ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

The-Paradise

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ప్యూర్ యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో నాని-శ్రీకాంత్ ఓదెల మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా, ఈ సినిమాను తొలుత వేసవి ట్రీట్‌గా మార్చిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ రిలీజ్ డేట్‌ను ఏకంగా ఆగస్టుకు వాయిదా వేశారు. అయితే, ఈ సినిమా రషెస్ చూసిన నాని కొన్ని ఎపిసోడ్స్ రీషూట్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని ఈ వార్తలు పేర్కొన్నాయి. అయితే, ఈ వార్తలపై మేకర్స్ ఘాటుగా స్పందించారు.

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి రీషూటింగ్ జరగడం లేదని.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని వారు తెలిపారు. అంతేగాక, ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని వారు రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దంటూ మేకర్స్ కోరుతున్నారు. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోండగా మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version