వరల్డ్ సినిమా దగ్గర ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ని ఆడియెన్స్ కి అందించిన సినిమాల్లో అవతార్ సిరీస్ కూడా ఒకటి. దర్శకుడు జేమ్స్ కేమెరూన్ ఆరంభించిన ఈ భారీ విజువల్ వండర్ సినిమాలు ఇప్పుడు మూడో పార్ట్ వరకు వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయ్యిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’.
గత రెండు సినిమాల కంటే కొంచెం అండర్ పెర్ఫామెన్స్ చేసింది కానీ వసూళ్లు మాత్రం మరీ అంత తక్కువేమి రాలేదు. ఇక ఫైనల్ గా ఈ సినిమా సుమారు 6 నెలల తర్వాత ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ వారు ఈ జూన్ 24 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు ఖరారు చేసేసారు.
అయితే దీనికి ముందు డిజిటల్ గా రెంటల్ రూపేణా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇక జూన్ నుంచి సబ్ స్క్రిప్షన్ ఉన్నవారికి ఎలాంటి ఛార్జ్ లేకుండా అందుబాటులో ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఇదే డేట్ లో పాన్ ఇండియా భాషల్లో ఇండియాలో కూడా జియో హాట్ స్టార్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
The world of Pandora awaits.
On June 24, stream Avatar: Fire and Ash only on Disney+. pic.twitter.com/zV7TAZsEeu
— Avatar (@officialavatar) May 12, 2026