ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండగా ఎట్టకేలకి సినిమా గ్రాండ్ రిలీజ్ కి రాబోతుంది.
అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాకముందు కరోనా లాక్ డౌన్ సమయంలో పెద్ది అనే టైటిల్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా చేయనున్నాడు అని అదే పెద్ది టైటిల్ పైగా స్పోర్ట్స్ డ్రామా అంటూ పలు వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే.
కానీ అది తర్వాత రామ్ చరణ్ దగ్గరకి వచ్చింది అని ఈ వెర్షన్ మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పెద్ది అనే సినిమా అసలు స్టార్ట్ చేసిందే రామ్ చరణ్ కోసం అట.
అది కూడా ఎప్పుడో బుచ్చిబాబు మొదటి సినిమా ‘ఉప్పెన’ రాక ముందే తన రెండో సినిమా రామ్ చరణ్ తో తన హీరో చెరుకు గోడౌన్ లో పని చేస్తాడు, అతడి పేరు పెద్ది అని రాసుకున్నాను అని దాని తాలూకా స్క్రీన్ షాట్ కూడా ఉందని బుచ్చిబాబు అసలు విషయం తెలిపాడు.
అంటే మొదట చరణ్ కోసం రాసుకున్న కథనే పెద్ది. మధ్యలో తారక్ దగ్గరకి వెళ్లి మళ్ళీ చరణ్ దగ్గరకే చేరుకుంది అని చెప్పాలి. సో ఈ ఇంటెన్స్ హై ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూన్ 4 వరకు ఆగాల్సిందే.
