గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జూన్ 4, 2026న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరుగుతుండటంతో, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐతే, ఈ సినిమా తన టీవీ ప్రసార భాగస్వామిని ఖరారు చేసుకుందని టాక్. జీ తెలుగు భారీ మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందట.
కాగా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ వద్ద ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
