బాక్సాఫీస్ ఊచకోతకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన ‘పెద్ది’

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ ప్రమోషన్స్‌లో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని.. అభిమానులకు కూడా ఈ సినిమా స్పెషల్‌గా ఉంటుందని ఆయన తెలిపాడు. బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ ఊచకోతకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టాడు ఈ స్టార్ హీరో. మరో 9 రోజుల్లో పెద్దిని థియేటర్లలో కలుస్తారు అంటూ రామ్ చరణ్ తాజాగా ఈ చిత్ర కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేశాడు.

దీనికి సంబంధించి ఓ సాలిడ్ పోస్టర్‌ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో పెద్ది పెహల్వాన్ తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

Exit mobile version