‘పెద్ది’: రెహమాన్ నుంచి మరో సర్ప్రైజ్.. అతి త్వరలోనే!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్, ఎమోషనల్ చిత్రమే పెద్ది. మంచి హైప్ నడుమ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తన నుంచి వచ్చిన అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఇటీవల వచ్చిన మస్సా మస్సా మరిన్ని అంచనాలు పెంచితే దీని తర్వాత రెహ్మాన్ నుంచి మరో సర్ప్రైజ్ ఉందని కన్ఫర్మ్ చేశారు. ఇటీవల కోలీవుడ్ లో జరిగిన ఇంటరాక్షన్ లో బుచ్చిబాబుతో మాటల్లో పెద్ది రామ్ చరణ్ ఇంట్రో థీమ్ స్కోర్ కూడా ఒకటి ఉందని దానిని త్వరలోనే రిలీజ్ చేద్దామని ఖరారు చేసేసారు. ఇది మాత్రం ఫ్యాన్స్ ని రెహ్మాన్ నుంచి మరో సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే. మరి ఇదెప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా ఈ జూన్ 4న గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

Exit mobile version