బుకింగ్స్ లో ‘పెద్ది’ భూకంపం మొదలు! అప్పుడే ట్రెండింగ్ లోకి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలానే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కలయికలో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ మల్టీస్పోర్ట్స్ డ్రామా గ్రాండ్ గా ఈ జూన్ 4న విడుదల కాబోతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఏపీలో బుకింగ్స్ మొదలయ్యిపోయాయి.

రెండు ప్రముఖ బుకింగ్ ప్లాట్ ఫామ్ లలో పెద్ది బుకింగ్స్ ఇపుడు షురూ కాగా బుకింగ్స్ టికెట్లు గట్టిగానే తెగుతున్నాయి. మెయిన్ గా బుక్ మై షో యాప్ లో పెద్ది బుకింగ్స్ ఇలా మొదలు కాగానే అలా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీనితో మన తెలుగు స్టేట్స్ లో పెద్ది భూకంపం మొదలైంది అనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా వదిలిన తర్వాత ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

Exit mobile version