మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. అయితే, సినిమాలోని ఎమోషనల్ డెప్త్‌ను ట్రైలర్లో బాగా చూపించినప్పటికీ, కథను ఇంకాస్త బెటర్‌గా ఎలివేట్ చేయాల్సింది అనే అభిప్రాయాలు కొన్ని వర్గాల నుండి వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికరమైన వివరణ ఇచ్చాడు.
ట్రైలర్‌కు వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్‌పై ఆయన స్పందిస్తూ.. తాము కావాలనే కథలోని అసలు పాయింట్‌ను రివీల్ చేయకుండా దాచామని చెప్పాడు. అంతేకాదు, ట్రైలర్ డిజైన్ చేసేటప్పుడు సినిమాలో ఉన్న దాదాపు 50 నిమిషాల అత్యంత కీలకమైన ఫుటేజ్‌ను అస్సలు టచ్ చేయలేదని, అందుకే అలా అనిపించి ఉండవచ్చని క్లారిటీ ఇచ్చాడు. గతంలో చాలా పెద్ద హిట్ సినిమాలకు కూడా ట్రైలర్స్ యావరేజ్‌గా ఉన్నాయని తెలిసి, తాము పర్ఫెక్ట్ మీటర్లోనే ఉన్నామనే నమ్మకం కలిగిందని ఆయన పేర్కొన్నాడు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
