ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మైఖేల్’ పార్ట్ 1.. ఎందులో అంటే

Michael

ఈ ఏడాది హాలీవుడ్ సినిమా దగ్గర నుంచి మంచి హైప్ తో రిలీజ్ కి వచ్చి అంచనాలు అందుకున్న సినిమాల్లో బయోపిక్ చిత్రం ‘మైఖేల్’ కూడా ఒకటని చెప్పొచ్చు. మ్యూజిక్ రంగంలో కింగ్ ఆఫ్ పాప్ గా నిలిచిన మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపింది.

మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ లీడ్ రోల్ లో దర్శకుడు ఆంటోని తెరకెక్కించిన ఈ మ్యూజికల్ ట్రీట్ సినిమా ఏకంగా 900 మిలియన్ డాలర్స్ కి పైగా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పటికీ థియేటర్స్ లో రాణిస్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో రెంటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో రెంటల్ రూపేణా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఓటిటిలో ఇంత మొత్తం కట్టి చూడాలి అనుకునేవారు ఇండియాలో చూడొచ్చు. దాదాపు ఇంకొన్ని రోజుల్లో ఫ్రీ స్ట్రీమింగ్ కి ఈ సినిమా రావచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version