ఎన్టీఆర్ ‘డ్రాగన్’ పై లేటెస్ట్ బజ్.. భారీ యాక్షన్ పార్ట్ కి రంగం సిద్ధం!?

Dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ సినిమా డ్రాగన్ కోసం అందరికీ తెలిసిందే. పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసే విధంగా కట్ చేసిన ఈ గ్లింప్స్ తో మొత్తం షేక్ చేసి పారేశారు. అయితే ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇలా నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి ఇప్పుడు వినిపిస్తోంది.

దీని ప్రకారం మేకర్స్ నెక్స్ట్ ఓ భారీ షెడ్యూల్ కి రంగం సిద్ధం చేస్తున్నారు అని తెలుస్తోంది. ఇందులోనే ఓ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ ని ఎన్టీఆర్ పై చేయడమే కాకుండా ఓ సాంగ్ ని కూడా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. అలాగే శ్రీలంకలో కూడా ఈ షెడ్యూల్ కొనసాగుతుందట. సో డ్రాగన్ మాత్రం ఇపుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version