అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్!

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన రూరల్ అండ్ రస్టిక్ డ్రామా ‘లెనిన్’. కొంచెం ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ పెట్టుకున్న బలమైన నమ్మకాన్ని ఈ చిత్రం నిలబెట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా ర్యాంపేజ్ చూపిస్తున్న ఈ సినిమా నార్త్ అమెరికా మార్కెట్ లో హాఫ్ మిలియన్ మార్క్ కి అతి చేరువులోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం 4 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని టచ్ చేసి ఈ ఆదివారం హాలిడే వసూళ్లతో హాఫ్ మిలియన్ మార్క్ ని సునాయాసంగా క్రాస్ చేయనుంది.

సో లెనిన్ మాత్రం అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అదరగొడుతున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంకి థమన్ ఎస్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, నాగార్జున నిర్మాణం వహించారు.

Exit mobile version