టాలీవుడ్‌కు కలిసొస్తున్న సాధారణ టికెట్ రేట్లు..!

అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే సాధారణ ధరలతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతి సినిమాకు రేట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్న ఎగ్జిబిటర్లకు ‘లెనిన్’ అనుసరించిన ఈ స్ట్రాటజీ విపరీతమైన సంతోషాన్ని కలిగిస్తోంది.

ఇదే పంథాలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కూడా టికెట్ ధరలు పెంచకుండానే ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ సాధించి, టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా ‘అరుంధతి’, ‘మహానటి’ రికార్డులను బ్రేక్ చేసింది.

‘పెద్ది’ సినిమా రూ. 300 కోట్లు సాధించినప్పటికీ, పది రోజుల పాటు రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులను దూరం చేసుకుంది. ‘శంకరవరప్రసాద్’ వంటి సినిమాలు కూడా ఈ సమస్య ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం 4 వారాల ఓటీటీ విండో ఉన్న తరుణంలో, మధ్యతరగతి ప్రేక్షకులకు ప్రధాన వినోదమైన సినిమాను అందుబాటు ధరల్లో ఉంచడమే పరిశ్రమకు మేలు.

Exit mobile version