‘కళ్యాణం కమనీయం జీవితం’ టీజర్ విడుదల

Kalyanam Kamaneeyam Jeevitham

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను పైలా ప్రసాదరావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.

దర్శకుడి జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, దానికి కల్పితాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. డ్రామా, సస్పెన్స్ నేపథ్యంతో సాగే ఈ ప్రేమకథకు ఎన్.సి. అరవింద్ ఏకలవ్య రచన చేయగా, శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించారు. డీఓపీగా వెంకటరాజు వ్యవహరించారు. ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని తదితరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రాజవంశీ ద్వారా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

Exit mobile version