టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!

ప్రస్తుతం ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న హాలీవుడ్ సినిమానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. టామ్ హోలాండ్ హీరోగా నటించిన ఈ సినిమా మార్వెల్ హిస్టరీ లోనే భారీ హైప్ నడుమ వచ్చింది. అంతే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అయితే రికార్డ్ ఓపెనింగ్స్ అందుకొని సంచలనం సెట్ చేసింది. ఏదో మన స్టార్ హీరో సినిమాలా ఏకంగా 70 కోట్లకు పైగానే గ్రాస్ ఈ సినిమా రాబట్టడం విశేషం. అయితే ప్రీమియర్స్ తోనే మన దగ్గర టాక్ వీక్ అని తేలిపోయింది.

అయినప్పటికీ ఇండియన్ మార్కెట్ లో స్పైడర్ మ్యాన్ సినిమా ఊపు ఏమాత్రం తగ్గలేదు. గత రాత్రి సమయంలోనే పీక్ గా గంటకి 67 వేలకి పైగా టికెట్ బుకింగ్ సేల్స్ జరిగాయి. ఇలా ఒక హాలీవుడ్ సినిమాకి బుకింగ్స్ జరగడం అనేది చాలా పెద్ద విషయం. మన దగ్గర పలువురు స్టార్ హీరోల సినిమాలకి సైతం అది కూడా ఇలాంటి టాక్ తో రావడం అనేది అసాధ్యం.అలాంటిది స్పైడర్ మ్యాన్ చేసి చూపించాడు. ఇక ముందు ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version