ఫ్రాడ్ కేసులో సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు..!

Salman-Khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్ మోసం కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్‌లకు చండీగఢ్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 5న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

లాభదాయకమైన బిజినెస్ అని నమ్మించి రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టించారని, ఆ తర్వాత ఎలాంటి కంపెనీ సపోర్ట్ ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయానని అరుణ్ గుప్తా అనే వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఆరోపణలను సదరు కంపెనీ ఖండించింది. సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ కేవలం బ్రాండ్ లైసెన్స్ మాత్రమే ఇచ్చిందని, ఒప్పందంతో సల్మాన్‌కు నేరుగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అక్టోబర్ 5న కోర్టు తదుపరి విచారణ జరపనుంది.

Exit mobile version